CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 706

మిమ్మును నింపె మేలులతోడ

mimmunu nimpe melulatoda

Psalm 68:19

More
Reference recording on YouTube ↗
పల్లవి:మిమ్మును నింపె మేలులతోడ - అవియేపరలోక దీవెనలు (2)
1. ఆయన మందిరమందే మీకు (2) అధిక దీవెనలు దొరుకును ఎన్నో (2) తన మందిర సమృద్ధిని పొంది (2) - త్రాగుడి జీవజలములను (2)
2. మీ పాపములను పరిహరించును ప్రభు మీకు విమోచన తనయందే కలదు సత్యుని కృపామహదైశ్వర్యముతో - సంతోషించుడి మీరు
3. తన రక్తముతో విమోచించిన వారికి ప్రభువు యిచ్చును స్వాస్థ్యము తేజోవాసులు పరిశుద్ధులతో - పాలివారినిగా చేసె
4. ప్రభు యేసు నెందరు స్వీకరించెదరో నిత్యజీవమును స్వతంత్రించుకొని పరిశుద్ధాత్మ వరమునుపొంది - ఆత్మలో ఆనందించెదరు
5. మిమ్మును స్థిరులుగా చేయును ప్రభువు మునుపటికన్న హెచ్చుగా నిచ్చి మీతో నుండగోరెను నిత్యము - పొందుడి ప్రభు దీవెనలు
6. ఆయన కృపలో వర్థిల్లినచో అనుదినము ప్రభు మిము దీవించును తన కృప మిమ్ము ఆవరించును - ఆనందించుడి కృపతో
7. జయ జీవితమును కలిగినవారే తన స్వాస్థ్యమును మిగుల పొందెదరు విశ్వాసముతో విజయముపొంది - పాడుడి హల్లెలూయ ప్రభుకే

Back to Hebron Seeyonu Geethalu