పల్లవి:ఉన్నత దుర్గము నా దేవుడే (2)- నా రక్షకుడే నాకాశ్రయుడు (2)
1. యెహోవా మహాత్మ్యము - ఎంతో గొప్పది (2) అధిక స్తోత్రములకు - పాత్రుండాయనే (2) ఆ ప్రభు ఐశ్వర్యము - గ్రహింపశక్యము కానిది (2)
2. నా కోటయు నాశైలము ఆయనే నాకేడెము రక్షణ శృంగమును ఉన్నతమగు దేవుడే - నా కాశ్రయ దుర్గము
3. నా ప్రియ ప్రభువు - దవళవర్ణుడు రత్నవర్ణుడు - నా కతి ప్రియుడు పదివేల మందిలో - అతని గుర్తించెదను
4. నిత్యజీవము - మెండుగ నొసగి పరమాహారము - తృప్తిగ నిచ్చె నిరతము తన కృపతో - నిలుపుకొనెను స్తోత్రము
5. విజయ గీతము - పాడెద ప్రభుకే విజయము నిచ్చెను - శత్రువు పైన ఉన్నత దుర్గముపై - నెక్కించెను స్తోత్రము
6. మహిమ పూర్ణుడు - నా ప్రభుయేసు ఇహకేతెంచును - నాకై త్వరలో హల్లెలూయ స్తోత్రముల్ - పాడి ప్రహర్షింతును