పల్లవి:మన ప్రభుయేసు వచ్చెడు వేళ (2) - మన సంతోష హృదయాలు చాల వెలసె (2)
1. భూదిగంత నివాసులారా (2) - పదిలముగ ప్రభు యేసుని చూచి (2) ముదముగ రక్షణ మరి పొందుడి (2)
2. వారాయన తట్టు చూడగనే - వారలకు వెలుగు కలిగెను వారి ముఖంబులు లజ్జింపకుండెన్
3. మన విశ్వాసమునకు కర్తయు - కొనసాగించెడు యేసుని చూచి వినయమున పరుగిడు పందెమున
4. శిష్యులు కన్నులెత్తి చూడగను - యేసే కనిపించెను వింతగను మోషే ఏలియాలు మరుగైరి
5. ప్రభుయేసే మన పరిమళ ప్రియుడు - మురిసెదము మన ప్రభువునందు మెరిసే మహిమలు మన భాగ్యమదే
6. మంచి కాపరి మన ప్రభుయేసు - మనకై తనదు ప్రాణము నిచ్చెను వినుడి మన రక్షకుని పిలుపు
7. ఆనందముతో ఆర్భాటముతో - అందమగు శ్రీ యేసుని జూచి హల్లెలూయా యని పాడెదము