CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 680

నూతన ఆకాశమును భూమి

nootana aakaashamunu bhoomi

Revelation 21:1-27

More
Reference recording on YouTube ↗
పల్లవి:నూతన ఆకాశమును భూమి నేను జూచితి -అందుండె శాంతి ఆనందజ్యోతి మహిమ తేజముల్ (2)ముందున్న భూమి యాకాశము లదృశ్యమాయెను -సముద్ర మికను లేదు అందున్న వెల్లను (2)
1. పరలోక రాజ్య పట్టణమెంతో యద్భూతము - గొఱ్ఱెపిల్ల కాంతితోడ దాని కాంతి ఎంతయో (2) సురక్షితంబు చేయబడెను ప్రాకారంబుతో- గొఱ్ఱెపిల్లకు యుగములు స్తుతియరాధన (2)
2. పరిశుద్ధ యెరూషలెము పరలోకమునుండి - దేవుని యొద్దనుండి దిగుట నేను చూచితి భర్తకొరకు అలంకరింపబడియున్న - పెండ్లికుమార్తెవలెనె సిద్ధమై యుండెను
3. సింహాసనము నుండి యొక స్వరము వింటిని - దేవుని నివాసము మనుజులలో నున్నది ఆయన వారితోడనే ఎల్లప్పుడుండును - ఆయన వారి దేవుడు వారాయన ప్రజలు
4. దేవుడు వారి కండ్లనీళ్ళు తుడిచివేయును - దుఃఖంబు మరణములు లీక నెన్నఁడుండవు ఏడ్పు బాధ శాపము లిక నెన్నడుండవు - రాత్రి లేదిక గొఱ్ఱెపిల్ల దీపంబాయెగా
5. సింహాసనాసీనుండు తానే మరల చెప్పెను - ఇదిగో సమస్తమును నూతనమాయెను పాతసంగతులెల్లను గతించి పోయెను - గతించినవి రావు మరల జ్ఞాపకమునకు
6. పట్టణమునకు ఎత్తైన ప్రాకారమున్నది - చుట్టు పండ్రెండు గుమ్మములు దానికున్నవి కట్టబడెను ముత్యములతో పునాదులు - చుట్టబడెను సూర్యకాంత సువర్ణములతో
7. పట్టణపు పునాదులు ప్రశస్తమైనవి - సూర్యకాంతము నీలము యమున పచ్చయు వైఢూర్యకెంపు స్వర్ణరత్న గోమేధికము - పుష్య పద్మరాగ స్వర్ణసునీయ సుగంధము
8. జయించువారు ధన్యులు యేలుదురెన్నడు - ధరించి తెల్ల వస్త్రములు సంతసింతురు ప్రభువు వారి - దేవుడై యుండు నిరంతము - వారసులై సర్వము స్వతంత్రించు కొందురు
9. ప్రభుని భక్తులారా మీరు సిద్ధపడుడి - అద్భుత రాజ్యమందు నుండ యాశపడుడి గొఱ్ఱెపిల్ల గ్రంథమున పేరున్న వారలు - ఘనంబుగ పరంబున ప్రవేశించెదరు

Back to Hebron Seeyonu Geethalu