CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 679

ధన్యుడవు నీవు ధన్యుడవు

dhanyudavu neevu dhanyudavu

Deuteronomy 33:29

More
Reference recording on YouTube ↗
పల్లవి:ధన్యుడవు నీవు ధన్యుడవు (2)- ఓ ఇశ్రాయేలు బహు ధన్యుడవు (2)యెహోవాయే నిన్ను విమోచించెను (2)ప్రజలలో నీవు మహా శ్రేష్టుడవు ధన్యుడవు (1) - ధన్యుడవు నీవు ధన్యుడవు (2)
1. నీ పాపము పరిహారమాయె - నీ యతిక్రమము తుడువబడెన్ (2) నిర్దోషియని నిన్నెంచె ప్రభు (2)- ఆత్మలో కపటము లేదనెను (2)
2. ఏర్పరచబడిన ధన్యుడవు - దరిజేరితివి నీ ప్రభుకడకు చేర్చెను తన మందిరములోన - తృప్తిపరచె దాని సమృధ్దిచే
3. దుష్టుల యోచనలో వెళ్ళక - పాపుల మార్గమున నిలువక అపహాసకులతో కూర్చుండక - ధర్మశాస్త్రము ధ్యానించునీవు
4. ప్రభునిచే నీవు బలమొంది - ప్రభు మార్గము నీయందుండి జలములలో నీవు నడచుచు - జలమయముగా చేయు నీవు
5. యెహోవాయే ఉత్తముడని రుచిచూచి మరి ప్రభు నెరిగి మహోన్నతుని ఆశ్రయించి - ఆరాధించు నీవు ధన్యుడవు

Back to Hebron Seeyonu Geethalu