పల్లవి:క్రీస్తే ఈ జీవితములో ఎంతైన మంచికాపరి (2)దుఃఖ సుఖంబులలో ఆయనే సహాయకుడు మనకు (2)
1. కష్టబాధలలో మన ప్రభువు - నమీపముగా నుండెనెంతో (2) గాలితుఫానులను గద్దించుచు - మనతో నుండు యాత్రలో (2)
2. ఇహలోక సాగరము దాటునప్పుడు - అలలెంతో మనలను కదిలింపగా మునుగు నప్పుడు మొరపెట్టిన - మనల రక్షంచు తానే
3. జీవిత నావపై దాడి చేసే - సాతాను క్రియలకు భయపడక ధైర్యము కొరకై ప్రార్థించిన - ప్రభువే మనల నడుపున్
4. జీవితములో నిరాశచే - కృంగిపోయి మనమున్నప్పుడు విజయము నిచ్చి బలపరచి - జీవకిరీట మిచ్చును
5. యేసు ప్రభువే మన దుర్గము - ఆయన యందే నిలిచినచో నిశ్చయముగ జయింతుము - ఓడిపోవును శత్రువు