పల్లవి:క్రీస్తేసు సిలువపై దృష్టినుంచి - ఆయన కృపయందే నిలుచుండుము (1)పరలోక మహిమ కిరీటముకై - క్రీస్తేసు అడుగులలో నడువుము (2)
1. సమాదాన దేశం పరలోకము - ఎన్నో దీవెనలు కలవందున (2) ఇహలోక శాంతి క్షణమాత్రమే - గొప్ప శిక్ష యందు దాగియుండె (2)
2. క్రీస్తు నుండి నిన్ను దూరపరచ - లోకాశలు నిన్ను ఆకర్షించు సిలువను చూడక పోయినచో - చిక్కుకొనెదవు ఈ లోకములో
3. ప్రభుయేసు సహవాసమున నిలిచి - సాతానుకు స్థలమియ్యకుము ఏవి క్రీస్తునుండి విడదీయునో - యేసు రక్తమందు కడుగుకొనుము
4. పరలోక దీవెనలు రుచిచూడను - ఆశతో వెళ్ళను సిద్ధపడు లోకమునకు నీవు వేరైనచో - ఆత్మీయముగ నీవు యెదిగెదవు