పల్లవి:జయము పొందుమని యేసు చెప్పెను (2)జయించువారే స్వాస్థ్యమొందెదరు (2)
1. జయవంతులే దైవ పరదైసులోనున్న (2) - జీవ వృక్షఫలమును భుజియింతురు (2) రెండవ మరణమును దాటెదరు (2)
2. మరుగైన మన్నానిచ్చి మరి తెల్లరాతి నిచ్చు - ఆ రాతిమీద క్రొత్త పేరుండును ఎరిగెదరు దాని పొందువారలే
3. ఎవరు అంతము వరకు స్థిరముగ నిలిచెదరో - ఏలెదరు జనులను అధికారులై ఇనుపదండముతో పరిపాలించెదరు
4. ధవళ వస్త్రములను ధరింప జేయువారికి - జీవ గ్రంధమున పేరు తుడువబడదు దేవ దూతల యెదుట ఘనత కలుగును
5. ఆలయ స్తంభముగా వారిని దేవుడు - నిలిపి స్థిరపరచి దీవించును నూతన యెరూషలేమని వ్రాయువారిపై
6. వారిని దేవుడు సింహాసనముపైన - కూర్చుండబెట్టి జీవమకుట మిచ్చును వారసులై నిత్యముగా జీవింతురు