పల్లవి:స్వాస్థ్యముగా నిచ్చితివి - జయించెడు వానికన్ని (2)
1. నీవే మాకు దేవుడవై యున్నావు (2) - మేము నీదు పుత్రులమైతిమి (2) నీ స్వంత రక్తము నిచ్చి (2) - కొన్నావు నీ సొత్తుగా (2)
2. నిన్నంగీకరించిన వారలందరిని - నీ నామమందు నమ్మిన వారిన్ నీ పిల్లలుగాను జేసి - అధికారమిచ్చితివి
3. నీతో కూడా మహిమను పొందుటకు - నీ శ్రమలలో పాలుపొందుటచే నీ తోటి వారసులముగా - పరిగణింపబడితిమి
4. అక్షయమైన నిర్మలమైనదియు - వాడబారని స్వాస్థ్యము కొరకై మరల జన్మింపగా జేసి - స్థిరముగా నుంచితివి
5. నీ శాసనములు హృదయానందములు - అవి అన్నియు మాకు నిత్య స్వాస్థ్యముగా భావించి నిలిచి యున్నాము - హల్లెలూయ గీతములతో