పల్లవి:అధికారము పొంది యుంటివి - ప్రభూ (2)పరలోకమందును భూమి మీదను - నీవు (2)
1. అన్నిటిలో నత్యధిక జయము - నొందుచున్నాము (2) మనల ప్రేమించిన యేసు క్రీస్తు - ప్రభువు ద్వారనే (2) కనుల కగుపరచిన విజయముకై - సన్నుతింతుము (2)
2. విశ్వసించు మనయందు తన - శక్తిని గూర్చి అపరిమితమైన ప్రబావమును - యెరిగి యున్నాము తిరిగి లేచిన ప్రభువును చూచి - హర్షించెదము
3. మనల బలపరచు ప్రభువునందు - బలము నొందుచు ప్రభున కింపైన కార్యములను - చేయుచుంటిమి తనదు పునరుత్థాన బలమును - పొగడెదమెపుడు
4. క్రీస్తు మరణములో సమానాను-భవము కలిగియు కష్ట నష్టములలో పాలివారమగుట - యెరిగియు ఆత్మ ప్రాణ శరీరములతో - ఆరాధింతము
5. మనల స్థిరపరచిన శక్తిగల - దేవునికి తనదు ప్రియ పుత్రుడు యేసుక్రీస్తు - ద్వారనే తనకు నిరతంబును మహిమ ఘనత- హల్లెలూయామెన్