CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 651

యెహోవా నీ కృపాతిశయమును

yehovaa nee krupaatishayamunu

Psalm 36:8

More
Reference recording on YouTube ↗
పల్లవి:యెహోవా నీ కృపాతిశయమును (1) - నిత్యము కీర్తింతున్ (2)
1. తరతరములకు నీ విశ్వాస్యత (1)- తెలియపరచెదను (2) కలువరి సిలువ రక్తముతో నిబంధన స్థిరపరచి - పాపము క్షమియించె (2)
2. ప్రతిశోధనపై నీవు నాకు - విజయము నిచ్చెదవు నన్ను విడిపించుటకు నీవు - నమ్మ దగిన వాడవు - నమ్మ దగిన వాడవు
3. నీదు వాత్సల్యము నాపై - నూతనముగా నుండున్ నీదు విశ్వాస్యత గొప్పదై - మారనిదై యుండున్ - మారనిదై యుండున్
4. నీదు రాకడ వరకు నన్ను - నిందా రహితునిగా నమ్మకమైయున్న నా ప్రభువా - నన్ను కాచెదవు - నన్ను కాచెదవు
5. మంచి పోరాటము పోరాడి - జయమును పొందెదను మహిమ మకుటము నిచ్చెడు ప్రభువునకు - హల్లెలూయ పాడెదను - హల్లెలూయ పాడెదను

Back to Hebron Seeyonu Geethalu