CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 652

ఆనందించెదము ప్రభు యేసులో

aanandinchedamu prabhu yesulo

More
Reference recording on YouTube ↗
పల్లవి:నష్టము నంతటిని మరల - మా యేసునిలో ఆర్జించితిమి (1)ఎల్లప్పుడు జీవితమతయు హల్లెలూయ పాడెదము (1)
1. ఆనందించెదము - ప్రభు యేసులో - అంతయు మరలార్జించు కొంటిమి (1) ఆదాము నుండి పోయిన దెల్లయు - అనుభవించు చున్నామిప్పుడు (1)
2. దావీదువలె అంత నష్టపడితిమి - దుఃఖపడి బహుగా ఏడ్చితిమి దావీదువలె ప్రభుని వెదకగ - తిరిగి ఆర్జించుకొంటిమి || న ||
3. పూర్వము నైక్యము లేకపోయెను - పేదలమై యుంటిమి అపుడు మనలను ఖాళీ చేసికొనగా - మరల నొందితిమి పూర్ణత || న ||
4. మొదటి ప్రమను కోల్పోతిమిల - వ్యర్థమైనట్టి ప్రేమనొందితిమి పొందితిమి యేసు ప్రభువులో - నిండుగను దైవ ప్రేమను || న ||
5. దేవుని కల్గియుండకుంటిమి - దైవసమాధాన మొందకుంటిమి పాపములలో మరణించియుంటిమి - పరమజీవ మొందితిమి || న ||
6. నిరీక్షణయేమి లేక యుంటిమి - నరకమున కర్హులమై యుంటిమి ఘనుడగు యేసు నంగీకరింపగా - నన్నును విమోచించెను || న ||
7. పాపము వలనెంతో నష్టపోతిమి - ప్రభులో సకలము సంపాదించితిమి శాపమునందు చుట్టబడితిమి - సర్వమొందెదము మరల || న ||

Back to Hebron Seeyonu Geethalu