పల్లవి:పర్వతమా నీవేపాటి (1) - జెరుబ్బాబెలు ఎదుటను సమభూమి వగుదువు (2)
అను పల్లవి:జనులందరూ కృప కలుగుననగా -తానుంచున్ - పై - రాతిన్ (2) - పర్వతమా నీవేపాటి (1)
1. శక్తితో కాదిది బలముతో కాదు - నాదు ఆత్మచే జరుగును యిదియనే (2) సైన్యములధిపతి యెహోవా వాక్కిది - మారదెన్నటికిన (2)
2. కాన ఆలయమును నిర్మింపను - పూనుకొందము రమ్మని పలుక మేలైన ఈ కార్యమును చేయను - బలమును పొందితిమి
3. ఆకాశమందున నివాసియగు ప్రభు - మా యత్నములను సఫలము చేయునని ఆయన దాసులమగు మేమెల్లరము - మొదలిడి ముగించితిమి
4. మందిరమును నాదు మహిమతో నింపుదున్ - మించును అదియెంతో మునుపటి దానిన్ మెండుగ నాదు నిండు నెమ్మది - నుండ నను గ్రహింతున్
5. సజీవ రాళ్లుగ ఆత్మ మందిరమున - నిపుణతతో మము నిర్మించుటకు పిలిచితివి నీదు యాజకులుగను - హల్లెలూయ పాడెదము