పల్లవి:ఓ ప్రభువా నీ సేవన్ - చేసెద నిత్యము - (2)నీ మాటే వినెద - నరుని మాట వినకుందు - (2)
1. శోధించు స్వరములు - వినబడుచునున్నవి వేధించు నేరములు - పైబడుచునున్నవి బోధించు నీ మార్గం - వినిపించు నీ స్వరము
2. బలమైన శత్రువు - బాధించుచున్నాడు విలువైన నీ రక్తం - ప్రోక్షించు నాపైన నీ హస్త బలముతో - జయమును నాకిమ్ము
3. లోకాశలు నన్ను - కదిలించుచున్నవి నిరాశ సమయములు - బెదిరించుచున్నవి ఆకాశము నుండి - ఆదరించుము నన్ను
4. బేతేలు దర్శనము - స్పష్టముగా చూపించు పెనుయేలు పోరాటం - దినదినము నేర్పించు నా కాలమంతయు - నను నడుపు నా ప్రభువా
5. మెల్లని నీ స్వరము - మధురముగా వినిపించు తిన్నని నీ త్రోవన్ - కొరకు చూపించు నీ వెలుగులో నన్ను - నిత్యము నడిపించు
6. పరిశోధించుము నన్ను - పరిశుద్ధ వాక్యముతో పరిశుద్ధాత్మ చేనన్ - ప్రభునింపు నీ కొరకే పరిశుద్ధ సంఘములో - అంగముగా ధౄఢపరచు
7. క్రీస్తే నా జ్ఞానము - క్రీస్తే నా నీతియును క్రీస్తే నా విజయము - క్రీస్తే నా ఆశ్రయము క్రీస్తే నా రారాజు - క్రీస్తే నా సర్వము