CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 640

నీ ప్రియ ప్రభుని సేవకై

nee priya prabhuni sevakai

Romans 12:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవే (1)పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననే (2)
1. అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానే (2) ఆ వెలుగు ద్వారానే - నూతనమార్గము కలిగే (2) సజీవ బలిగా నర్పించు - నీ జీవితమాయనకే (2)
2. తప్పిపోతివి గతమందు - తప్పుదారిని నడిచితివి తన ప్రేమాహస్తమే - నిన్ను కాపాడి తెచ్చెను యెంతైన స్మరియించు నీవు - వింతైన తన ప్రేమన్
3. ఓ ప్రియుడా తలచితివా - నీ జన్మమే పాపమని ప్రభువే తన రక్తముతో - నీ పాపము క్షమియించె నీ యుల్లము ఆయన కాలయమే - జ్ఞాపకముంచుకొనుము
4. యెవరతని సేవించెదరో - ఫలమొందెదరంతమందు ఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీ కిచ్చె కృతజ్ఞుడవై కొనియాడు - ప్రభుపాద సన్నిధిని

Back to Hebron Seeyonu Geethalu