పల్లవి:మన యేసు ప్రభువు శీఘ్రముగ వచ్చును - అతివేగముగా సేవ చేతుము (1)యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము (1)
1. యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము (2) మనమందరము ఆయన సేవను - ఏకమై సదా జేసెదం (2)
2. అందరి యెడల ప్రేమ జూపెదం - యేసు చెంతకు పిలిచెదము అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో - రాజ మార్గమును చూపెదము || మన||
3. సాతాను దుర్గమును పదగొట్టి - ఇక యేసు కొరకే జీవింతుము ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ - ఎల్ల వేళలందు చాటెదము || మన||
4. ప్రాణాత్మ దేహములు ప్రభుసేవకే - ఇక జీవించుట తన కొరకే అని నిశ్చయించుచు అందు నిలిచియుండి - ప్రభుదినమందు హర్షింతుము || మన||