పల్లవి:పల్లవరపు కొండలపైన - ప్రభుచూపిన దర్శమలంఅహ పల్లవరపు కొండలపైన - పరలోక సంఘదర్శనమిచ్చెన్ (2)
అను పల్లవి:తొలిప్రేమ కలిగి అందరము - బలియైన క్రీస్తును ప్రకటించి (2)మారాను పోలిన శ్రమలున్నా - కానాను పురముకు చేరుదము (2)
1. అపొస్తలుల బోధ - సహవాసము ప్రభు బల్ల ప్రార్థన జీవితము - సంఘ దర్శనమునకు మూలం (2) ఈ ఆత్మీయ లంగరులను కలిగి - కొనసాగెదము తుఫానులలో ఈ ఆత్మీయ లంగరులను కలిగి - ఈ పాప సముద్రము దాటెదము
2. విశ్వాసము ప్రేమ - నిరీక్షణ నిలుచునిల అపకారము మాని - డంబమును విడచెదము సోదర ప్రేమలేనిచో - వ్యర్థులము మన మీ లోకములో సోదర ప్రేమలేనిచో మ్రోగెడి తాళము వలె నుండెదము
3. దేవుని చిత్తమును - ఎరిగి జీవించెదము ప్రభు చిత్తము కొరకు - చెల్లించెదము క్రయము దేవా నీ చిత్తము నెరవేర్చ - మాకెంతో సంతోషము దేవా నీ చిత్తము నెరవేర్చ - నీకెంతో సంతోషము
4. దేవుని మందిరమున్ - ప్రేమించెదమెల్లప్పుడు దేవుని వాక్యమును - ఆలయములో ధ్యానింతుము చిరకాలము దేవుని మందిరములో - నివసించి స్తుతియించెదము చిరకాలము దేవుని మందిర తేజో- మహిమలో వసియించెదము
5. ఆత్మతో సత్యముతో - నిజ ఆరాధన కలిగి యధార్థ హృదయముతో - మంచి సాక్ష్యమును కలిగి పెదవుల పదములు కాదని - మన హృదయములను అర్పించెదము పెదవుల పదములు కాదని - హెబ్రోను ప్రభుని కొనియాడెదము
6. చెప్పనశక్యమును - మహిమా యుక్తమునైన సంతోషము కలిగి సువార్తను చాటెదము ఆకాశము క్రింద ఏ నామమున - రక్షణ లేదని చాటెదము ఆకాశము క్రింద యేసు నామమునే - పాపక్షమాపణ కలుగునని
7. పేరున పిలిచితివి - నీ దాసుని సేవకై సార్వత్రికమందు - సంఘమునకు ఏర్పరచ ఆనంద భాష్పములతో మేము - ఆత్మీయ తండ్రిని స్మరియింతుము ఆనంద భాష్పములతో మేము ఆయన బోలి నడిచెదము