CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 624

నీ సాక్ష్యము ఏది? నీ బలి అర్పణ ఏది?

nee saakshyamu edi? nee bali arpana edi?

Matthew 9:37

More
Reference recording on YouTube ↗
పల్లవి:నీ సాక్ష్యము ఏది? - నీ బలి అర్పణ ఏది? (2)ప్రభు యేసు నంగీకరించి - నిద్రించెదవేల? (1)ప్రభు యేసు నంగీకరించి - జాగు చేసెదవేల? (2)మేల్కో - లెమ్ము (2) - రారమ్ము విశ్వాసి (1)
1. అపొస్తలుల కాలమందు - ఉపద్రవముల ఒత్తిడిలో (2) అన్నింటి సహించుచు (2) - ఆత్మలాదాయము చేసిరి (1)
2. రాళ్ళతో కొట్టబడిరి - రంపాలచే కోయబడిరి పరమ దర్శనమొంది - సువార్తను చాటించిరి
3. కొరడాతో కొట్టబడిరి - చెరసాలయందుంచబడిరి చెరసాల సంకెళ్ళును - వారి నాటంక పరచలేదు
4. సజీవ యాగముగ - ప్రభు సేవను జరిగించిరి సువార్త ప్రభలమాయె - సంఘము స్థాపించబడె
5. కోతవిస్తారమెంతో - కోత కోయువారు కొందరే యేసునిన్ పిలుచుచుండె - త్రోసివేసెదవా ప్రభు పిలుపున్
6. అర్పించెద నన్ను - ఆత్మ ప్రాణ శరీరముతో నా సిలువను ఎత్తుకొని - నిన్నే వెంబడింతును నేను

Back to Hebron Seeyonu Geethalu