పల్లవి:వెళ్ళెదము కూడి వెళ్ళెదము (2)శ్రేష్ఠ దేశమును చేరుటకు (2) - నీతి నివసించును అందున (2)
1. భయమును కలిగి బ్రతికెదము - పరదేశులమని యెరుగవలె (2) ప్రవేశించ వలె విశ్రాంతిలో (2) - తప్పిపోదుము మరచినచో (2)
2. ప్రభువాజ్ఞలను పాలించుటకు - ప్రయాస పడెదము మనమిలలో పదిలముగా అంతము వరకు - పడిపోకుండా చూచుకొందుము
3. ప్రభువు మన కప్పగించినవి - పట్టుకొని మనముండెదము దుష్టుని బారిని తప్పించుకో - దోచుకొన నివ్వకు మకుటము
4. సుళువుగా ఉరియొడ్డు - ప్రతి పాపమున్ - సంపూర్ణముగను తొలగించుచు సహనముతోడ పరుగెత్తుచు - స్వర్గ దేశము చేరవలెన్
5. సంపూర్ణత పొందసాగెదము - సమర్పించుకొని పూర్ణముగా సహించిన కష్టదుఃఖములు - బహుగా ఫల మొందెదము"