1. క్రీస్తుని చూచుచు సాగివెళ్ళెదను - సీయోను యాత్రలో (2) లోకమున్ విడిచి చేరుకొందును మహిమ దేశమున్ (1) క్రీస్తుని అనుగ్రహములో సురక్షిత హస్తములలో (2) మహానందముతో స్తుతించుచు చేరుదు నాదేశమున్ (2)
పల్లవి:ఎంతో సుందర జీవితము - మహిమతో నిండినది (2)సదా సర్వదా క్రీస్తుతో నుండి (1) మహిమ పరచెదను - మహిమలో నుండెదను
2. దుఃఖ శ్రమలలో నన్ను రక్షించు దాగుచోటు ఆయనే సంకటక్లేశ పరీక్షలలో జయము పొందెదను ప్రభునికై జీవించెదను ఆయన అడుగు జాడలలో ఆత్మ ప్రాణ శరీరము లర్పించి ఆయనను సేవింతును || ఎంతో ||
3. యాత్రికుడను ఈ జగమందు - పరవాసినైతి నేను స్వల్పజీవితము భువియందు గడిపి - చేరుదున్ ఆ దేశమున్ నాకై విజ్ఞాపనము చేయు - మహాయాజకుడు యేసునితో తోడి వారసుడనై ఆయనతో - నిత్యము ఏలెదను || ఎంతో ||