పల్లవి:అద్భుత దీవెనలు - ప్రభువా కుమ్మరించితివి (1)నీదు ప్రేమ అపారము - ప్రభువా మాపై జూపితివి (2)
1. మానవుని చేసినావు - నీ స్వంత రూపమునకు (2) నీ కిష్టులముగా బ్రతికి (2) - దీవెనలెన్నో పొందెదము (2)
2. నూతన జన్మవలన - ఆశీర్వాదములు దొరికె శాపమును దూరపరచి - సర్వంబు క్రొత్తజేసె
3. లోకమునుండి వేరై - సిలువను మోయవలెను అప్పుడే ప్రభు దీవించు - స్వాస్థ్యమును గాంతుమెంతో
4. తన సుతులుగాను మెలిగి - తన చిత్తమందు నిలిచి జీవజలమును పొంది - దేవెనలెన్నో పొందెదము
5. ఆత్మీయముగ నడిచి - శరీర క్రియలను విడిచి ఆయన స్వరము వినుచు - దీవెనలెన్నో పొందెదము
6. ఆశీర్వాదముల కొరకు - పిలువబడియున్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో - దీవెనలెన్నో పొందెదము