పల్లవి:రారమ్ము రారమ్ము సాత్వీకుడైన యేసుని యొద్దకు రారమ్ము -రారమ్ము - ప్రభుని యొద్ద నేర్చుకొన నేర్చుకొన (1)
1. సర్వమునకు సృష్టికర్త - సర్వాధికారియగు (2) దేవుని కుడి పార్శ్వమున - నుండి నీతో మాట్లాడును (2)
2. పాపభారము వలన నీవు - కృంగిపోయి ఉంటివా లోక చింతవలన నీవు - కలవరము కలిగియుంటివా
3. దీనుడవై నీ పాపమును - నేడే ఒప్పుకొనుము క్రీస్తు నందు విశ్వసించిన - కడుగు తనదు రక్తముతో
4. నీకు ఆయన సమాధాన విశ్రాంతి దయచేయును నిన్ను పవిత్రునిగ చేసి - నిన్ను తృప్తిపరచును
5. యేసు ప్రభునే వెంబడించుము - నిన్ను విడువడెన్నడు ప్రభునిచిత్తము నెరవేర్చుచు ఆయననే సేవించుము
6. ప్రభునియందు నిలిచియుండిన - ప్రాపుగ ఫలియింతువు ప్రభువునకే మహిమ కలుగు - మంచి ఫలముల ఫలియించుము
7. యౌవనజనమా ప్రభుని వాక్యము - విని విధేయత చూపుమా యౌవన జీవిత మర్పించుటకు యేసు నొద్దకు రారమ్ము