CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 510

భయపడకుము నీవు యుద్ధము యెహోవదే

bhayapadakumu neevu yuddhamu yehovade

Isaiah 54:17

More
Reference recording on YouTube ↗
పల్లవి:భయపడకుము నీవు - యుద్ధము యెహోవదేనిశ్చయముగ జయము - నీదే భయపడకుము - భయపడకుము నీవు (1)
1. గర్జించు సింహమువలె శత్రువు - నీపైని బడ జూచుచుండె (2) నదివలె నీపై పారవచ్చును (2) - యుద్ధము యెహోవదే భయపడకు (2)
2. పాలు తేనెలు ప్రవహించెడు - కానాను మీయెదుట నుండె శత్రువు నిన్ను జంపజూచె - యుద్ధము యెహోవదే భయపడకు
3. నీకు విరోధముగ రూపించు - యే ఆయుధము వర్ధిల్లదు ప్రతి నాలుక తీర్పుకు లోనగును - యుద్ధము యెహోవదే భయపడకు
4. ఇహపరమునందు మన ప్రభువునకు - సర్వాధికారము నియ్యబడెను ఆయన సన్నిధి నీతో యుండును - యుద్ధము యెహోవదే భయపడకు
5. నీవు పోరాడెడు పనిలేదు - నమ్మకముంచి విశ్వాసముతో రక్షణను తిలకించుము - జయము ప్రభువుదే భయపడకు

Back to Hebron Seeyonu Geethalu