CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 496

శాశ్వతమైనది ప్రేమ యెహోవా తండ్రి ప్రేమ

shaashvatamainadi prema yehovaa tandri prema

1 Cor 13:8

More
Reference recording on YouTube ↗
పల్లవి:శాశ్వతమైనది ప్రేమ (2) - యెహోవా తండ్రి ప్రేమ (2)- శాశ్వతమైనది ప్రేమ (2)
అను పల్లవి:ప్రేమలో భయమేమియు లేదు (2) - ప్రేమ పరిపూర్ణంబైయున్న (2) || శాశ్వ ||భయమును - పారగద్రోలున్ (2)
1. దీర్ఘకాలము ప్రేమ (2) - దయచూపి సహించును (2) దీర్ఘకాలము ప్రేమ (2) - మత్సరపడదీ యుత్తమ ప్రేమ (2) డంబముగా నడువనిదీ ప్రేమ (2) - ఉప్పొంగనిదీ ప్రేమ (2)
2. స్వప్రయోజనమును - ఎప్పుడు కోరనిదీ ప్రేమ స్వప్రయోజనమును - అమర్యాదగ నడువని ప్రేమ త్వరగా కోపపడని ప్రేమ - తలచదు అపకారమును
3. దుర్నీతిలో గాక - సత్యాన సంతోషించున్ దుర్నీతిలో గాక - అన్నిటిని తాళుకొను ప్రేమ అన్నిటినమ్మియోర్చెడి ప్రేమ - అన్నిటి నిరీక్షించున్
4. నిలుచును విశ్వాసము - నిరీక్షణయు మరి ప్రేమ నిలుచును విశ్వాసము - వీటిలో శ్రేష్టమైనది ప్రేమ ప్రేమను కల్గియుండుటకు - ప్రయత్నించుడి మీరు
5. ప్రేమలేనివాడు - దేవుని ఎరుగనివాడు ప్రేమలేనివాడు - మన దేవుడు ప్రేమస్వరూపి తన ప్రేమ మనలో సంపూర్ణ - సిద్ధిని పొందవలయు
6. నిన్నడుగుచున్నాడు - నిను ప్రేమించిన ప్రభుయేసు నిన్నడుగుచున్నాడు - నన్ను ప్రేమించుచున్నవా? వీరికంటె నా పై నీకు - ఎక్కువ ప్రేమగలదా?
7. నను ప్రేమించినయెడల - నాయాజ్ఞలను గైకొనుము నను ప్రేమించినయెడల - మీలో మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుచున్న ఎడల - అదియే మహాదానందం

Back to Hebron Seeyonu Geethalu