పల్లవి:పరిశుద్ధులై యుండుడి దైవ చిత్తమున పెరుగుడి (1)యథార్దులై యుండుడి - పరిశుద్ధులై యుండుడి (1)
1. నడతలలో - వస్త్రములలో - ఆటంకము లేమియు లేకుండ (2) అడుగు ప్రశ్న జవాబులలో - విడువకజూపుము - పరిశుద్ధత (2)
2. పనులలోన ప్రతిస్థలమున - పరిశుద్ధ జీవిత మవసరము ప్రతిదారిన్ - ప్రతి సమయమున - పనులలో చూపుము - పరిశుద్ధత
3. ప్రేమ ఐక్యత పెరుగజేయున్ శ్రమ దుఃఖముల దూరపరచున్ ప్రియముతో నెల్లరు చేరి - పోరుమాని కోరుము - పరిశుద్ధత
4. దేవునిపోలిన జీవముఁజూప - కావలయును పావన జీవం జీవిత వేషంబు వ్యర్థము - కీడునుబాపును - పరిశుద్ధత
5. శుద్ధసాక్ష్యము - భద్రపరచును - ఇద్దరిణిలో సిద్ధపరచున్ శుద్ధమగు - చిత్తంబు కలుగు - నిత్య పవిత్రత నిడు - పరిశుద్ధత
6. నీతితోడ - జ్యోతియుండిన - లేదు కొఱత లేదు చూడన్ మేదినిపై నిలుచు శేషము - వాదమేమి నికలేదు - పరిశుద్ధత
7. ఇలను దేహమాత్మలందు - కల్మషంబు కానరాదు తెలుపగు తేటైన మచ్చలు - సిలువరక్తమున - పరిశుద్ధత