CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 477

దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే

dappigonina vaanipai neetin kummarinchunu aa prabhuve

Isaiah 44:3

More
Reference recording on YouTube ↗
పల్లవి:దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే (1)ఎండియున్న భూమిపై జలముల్ - ప్రవహింప జేయునాయనే (2)
1. వడిగల జలములలో దారిన్ - నిర్మించును ఆ ప్రభువే (2) అడవులలో రాజబాటలను - స్థాపించును మన ప్రభువే (2)
2. మన సంతతిపై ఆత్మన్ - కుమ్మరించును మన ప్రభువే తన ఆత్మలో వారిని నింపి - నిర్మించును సంఘముగా
3. నీటికాలువలయొద్ద - నిరవంజి చెట్లవలె గడ్డిలో యెదుగునట్లు - వారు వర్ధిల్లెదరు
4. కరుణాపీఠము పై నుండి - మాట్లాడెను మన దేవుడే పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే
5. ఆకాశము తెరువబడగా - మాట్లాడెను మన దేవుడే ఒక శబ్దముచే తన సుతుని - ఘనపరచెను మన దేవుడే
6. మందసమున్ దేవుని ప్రజలు - మందిరమందుంచగనే మందిరమున్ క్రమ్మెను ప్రభుని - తేజోమహిమంతటను
7. తన ప్రజలెల్లప్పుడు క్రీస్తున్ - సేవింతురు హర్షముతో దిన దినము దేవునికొల్చి - హల్లెలూయ పాడెదరు

Back to Hebron Seeyonu Geethalu