పల్లవి:నిత్యుడేసునే స్తుతించు - తన సత్యము కొరకై - నిత్యుడేసునే స్తుతించు (1)
అను పల్లవి:మధ్యవర్తియాయే చెదరిన - పరిశుద్ధులకు తానే యిలలో (2)
1. మేఘ మండల మంటుచున్నది - నాకు దాహంబది తీర్చుచున్నది (2) వేగమే మనుజులను మార్చివేయును - మార్చివేయునదియే (2)
2. విడుదలను ఇచ్చునదియే - విడిపించు ఘోరపాపము నుండి కడు శ్రమలనది స్వీకరించును - స్వీకరించునదియె
3. పృధివి నెల్లయు మారిపోయినన్ - సత్యమెన్నడు మారనే మారదు నిత్యమైన యేసు సత్యమాయెనిలలో - సత్యమాయెనిలలో
4. ఖడ్గంబుబోలి కోయునదియె - పడగొట్టును దుష్టులనదియే వడివడిగా తనపని నెరవేర్చునదియే - నెరవేర్చునదియే
5. ఉదకంబు బోలి కడుగునదియే - అద్దముబోలి చూపునదియే అది బంగారు విలువ గలది - విలువ గలదియే
6. దీపమై చీకటిని పోగొట్టును - కోపమున్ బారద్రోలును నదియే ఆపదలనెల్ల తొలగించునదియే - తొలగించునదియే
7. సుతైను బోలి పగులగొట్టును - మెత్తగా చేసి ఒప్పించునదియే క్రొత్త తేనెన్ బోలి రుచించునదియే - హల్లెలూయా ఆమెన్