1. మంగళముగ పాడుడీ - కృప సత్యంబును (1) రంగుగ జ్ఞానమిచ్చెడు దివ్యవాక్యము (1) విజయ సత్యవేదము - మంగళ నిత్యదీపము (1)
పల్లవి:అమృతము అద్భుతము దివ్యసత్యము (2)
2. సువి శేషమును ప్రకటింపు - కృప సత్యంబును పాప ఘోరంబు తెల్పును - దివ్యవాక్యము పరలోక వర్షము - జ్ఞాన నింపుదలయును ||అమృత||
3. దేవుడేసు హర్షించెడు - కృపసత్యంబును జీవ మంగళ వాక్యముల్ - దివ్యవాక్యముల్ యేసు నన్నుచూడు - నిత్యము శుద్ధీకరించు ||అమృత||
4. రెండుయంచుల ఖడ్గము - కృప సత్యంబును ఉల్లముల్ కరిగించెడు దివ్యవాక్యము యోచనల్ చూపుదర్పణము - కలితిలేని జ్ఞానము ||అమృత||
5. ఆత్మకాహారమిదియే - కృప సత్యంబును పాపికి జీవపానము - దివ్యవాక్యము పాదములకు దీపము - కాళ్ళకు మంచి వెల్గును ||అమృత||
6. విశ్వాసుల సువార్తయే - కృప సత్యంబును నిశ్చయమైన పునాదియే - దివ్యవాక్యము విడుదలనిచ్చు సత్యము - ఉన్నతలోక సత్యము ||అమృత||
7. హల్లెలూయ పాడెద - కృప సత్యంబును అపవిత్రతను పోగొట్టున్ దివ్యవాక్యము ప్రభువు నామమిదియే - నాదు ఆస్తియునిదే ||అమృత||