పల్లవి:ఇమ్ముగ నీ సు - దినంబు నుండి మిమ్ము నాశీర్వాదించెదనుపొమ్మనిన ఓ మా ప్రభువా (2)
1. మునుపటి మందిర - మహిమను మించు - కడపటి మంది-ర మహిమ (2) ఈ స్థలమందు నా సమాధానం (2) ఎంతైన నిచ్చెద నంటివి ప్రభువా (2)
2. అన్యజనులను కదిలింపగానే - అన్ని వస్తువులు తేబడును వెండి బంగారము అన్నియు నావే దండిగ నిచ్చెద నంటివి ప్రభువా
3. ఇంపుగ తొమ్మిదవ మాసమున - ఇరువది నాల్గ - వ దినము నీ మందిర ఆ-స్థి భారమును నీ వాజ్ఞాపించి - వేయించితివి
4. నీ ఆజ్ఞలను - శిరసావహించి - దివ్యంబుగ నా-బ్రాహాము హెబ్రోనులో గు-డారంబు వేసి కట్టెను బలిపీ-ఠము నాచోట
5. నిండు మనస్సుతో - కాలేబు నిన్ను - దండిగ ననుస-రించగ హెబ్రోనును తన - స్వాస్థ్యంబుగను సంభ్రముగ నొ-సంగినదాత
6. దావీదు రాజు - నీ సన్నిధిలో - దీనతతో మన-వి చేయ హెబ్రోను పొమ్మని - సెలవిచ్చితివి ప్రభో కలుగు నీకు నిత్యమహిమ
7. ఎల్లల నెల్ల - విశాల పరచి - కొల్లగ ప్రేమను - జూపి ఎల్ల శక్తిని - జూపిన ప్రభో హల్లెలూయ నీకే - యేసు ప్రభో