CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 446

దైవదర్శనమున యాకోబు

daivadarshanamuna yaakobu

Genesis 28:19

More
Reference recording on YouTube ↗
1. దైవదర్శనమున యాకోబు - దివ్యముగను చూచి (2)ఆ స్థలమునకు బేతేలనియెడి నామమును తానిడియె (2) సుస్థిరముగ మన పరమ తండ్రి - వసియించెడి స్థలమిదియె (1) || దైవ||
2. దేవుని నిచ్చెనగు క్రీస్తు దివికి నిలువబడెను దేవుని దూతలు దానిపైని ఎక్కుచు దిగుచున్నారు దేవుని మందిర మిదియె కాని వేరే స్థలమిదికాదు || దైవ||
3. నిశ్చయముగా నీ స్థలమందు - నిలిచి యుండె నెహోవా ఆశ్చర్య పరలోకపు గవిని రక్షణ బొందగ రారే విశ్రాంతి దేవునికి కలుగు - పాపికి భయంకరము || దైవ||
4. ఉన్నత స్థలముల నెక్కించి ఆనందింప జేసి అనుభవమునందు యాకోబు - స్వాస్థ్యము నొసంగి ఐగుప్తు యవమానమును దొరలింపజేయును || దైవ||
5. పర్వతములు తత్తరిల్లి తొలగిపోయినను సర్వదా తన కృపతోడై - నిన్ను నడిపించును పూర్వమందు పలికిన మాటల - నిర్వహించును నీలో || దైవ||

Back to Hebron Seeyonu Geethalu