పల్లవి:శక్తిగల షాలేమురాజా షారోను రోజా - స్తుతియించెదము యేసు (2)
1. పూర్వమున పల్కిన నీ ప్రవచవోక్తులన్ని (1) చక్కగను మక్కువతో చేసితివి నీవు - చేసితివి నీవు (1) పూర్వమున చూపిన నీ ప్రత్యక్షతలన్ని (2) వరుసగను జరిపితివి నిన్ను పోలినవాడు వేరెవ్వరు లేరు (2)
2. బయలు పరచినట్టి నమూనాను పోలి నాడు బలముగను నీదు ప్రత్యక్ష గుడారమును - నీ గుడారమును కట్టితివి నీ దాసుడై నట్టి మోషే ద్వారా నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను - ప్రభావ మహిమను
3. షాలేము యెసూషలేములోని ఆలయము సొలొమోను ద్వారా కట్టించిన మహారాజా - కట్టించిన రాజా ఆలయమును నిర్మించినట్టి మహారాజా నింపితివి నిండైన నీ ప్రభావ మహిమను - ప్రభావ మహిమను
4. కాలము సంపూర్ణముగ పరిణమించగానే కన్య గర్భమున ప్రభో జన్మించితి వీవు - జన్మించితి వీవు కట్టెదను నా సంఘము నని సెలవిచ్చి కట్టుచున్నావు మమ్ముల నీ స్వరూపమునకు - నీ ఆలయముగను
5. హస్తకృతాలయములో వసించని నీవు వింతగాను మా మధ్యను ఉండగోరినావు - ఉండగోరినావు కాంతివంతమైన నీదు మహా మహిమతోనే స్వంత వారినంత నింప తీర్మానించినావు - తీర్మానించినావు
6. అక్కడను ఇక్కడ నొక్కొక్కరిని యేరి అద్భుతముగను జత చేయువాడ వీవు - చేయువాడ వీవు నూతన దంపతులను వింతగా దీవించి అంతకంతకు వర్ధిల్ల జేయువాడ వీవే - కాయువాడ వీవే
7. వ్యక్తులను కుటుంబములనుగా మార్చివేసి శక్తిగల సంఘ వధువుగ మార్చివేసి - నీవే మార్చివేసి వింతగా నా వధువునకు వరుండవై నావు ఆంతము లేదహా నీ మహిమ రాజ్యమునకు - హల్లెలూయా ఆమెన్