1. నాకై చీల్చబడ్డయో - నాయనంతనగమా - నీలో దాగియుందును జెన్నుమీర బారెడు - రక్తజలధారలా - శక్తి గ్రోలగా నిమ్ము
2. నేను నాదుశక్తిచే - నిన్ను గొల్వజాలను - కాలమెల్ల నేడ్చినన్ వేలకృతుల్ చేసినన్ -నేను చేయు పాపము - నేనే బాపజాలను
3. వట్టిచేయి చాచుచున్ - ముట్టి సిల్వ జేరెదన్ - దిక్కులేని పాపిని బ్రక్కజేర్చి బ్రోవుము -నా కళంకమెల్లను - నాథా నీవె బాపుము
4. ఈ ధరిత్రియందున - నేఱు దాటునప్పుడు - నాదరించి నీకడన్ నాకై చీల్చబడ్డయో - నాయనంత శైలమా - నన్ను చేరదీయుమా