పల్లవి:నేను ఘోరపాపిని (2) - చేరి వేడుచుంటిని క్షమించుము (2)
1. ఆదాము హవ్వలందున ఏదేనులో నే పొందిన (2) ఆది దోషము అంటియుండెనయ్య - దాని నిర్మూలించు మేసయ్యా (2)
2. నా తల్లి గర్భమందున అవతరించుట తోడనే పాపము తోడనే పుట్టితి నేసయ్యా - దాని పరిహరింపుము
3. నా యపరాధము చేతను నే జేసిన పాపమందున సత్యములేక నేజచ్చిన వాడను - ననుజీవింపచేయు మేసయ్యా
4. పాపములు దాచుకొంటిని శాపమును గూర్చుకొంటిని ఆపద గుర్తించ లేక నే గడిపితిని - దాపు జేరితి ప్రాపునీయుము
5. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేకను పచ్చిపుండ్లు గాయములతో నేసయ్యా - వచ్చి నీ ప్రాపున జేరితి
6. లోకానంద యంద మందున వీకతో వీక్షింపనేగితి దావీదువలె బెత్షెబా బారిలో నుంటి - దేవా విమోచించు మేసయ్యా
7. ఎన్నెనోమార్లు నీ సన్నిధిన్ నేను విడిచి ఏతెంచితి యోనావలె మీనాగర్భములో నుంటి - నన్ను నీదరిజేర్చు మేసయ్యా