పల్లవి:నీ జీవితములో - గమ్యంబుయేదో - ఒకసారి యోచించవాఈనాడే నీవు ప్రభుయేసుకొరకు - నీ హృదయమర్పింపవా (2)
1. నీ తల్లి గర్భమున నుండినపుడే - నిను చూచె ప్రభు కన్నులు (2) యోచించినావా ఏ రీతినిన్ను - నిర్మించె తన చేతులు (2)
2. నీలోన తాను నివసింపగోరి - దినమెల్ల చేజాచెను హృదయంపు తలుపు - తెరువంగ లేవా యేసు ప్రవేశింపను
3. తన చేతులందు రుధిరంపుధారల్ - స్రవియించె నీ కోసమే భరియించె శిక్ష నీ కోసమేగా - ఒకసారి గమనించవా
4. ప్రభుయేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా ఈ చోట నుండి ప్రభుయేసు లేక - పోబోకుమో సోదరా!