CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 414

లోకమును విడచి వెళ్ళవలెనుగ

lokamunu vidachi vellavalenuga

Hebrews 13:14

More
Reference recording on YouTube ↗
పల్లవి:లోకమును విడచి వెళ్ళవలెనుగ (2)సర్వమిచ్చటనే - విడువవలెన్ విడువవలెన్
1. యాత్రికులము యీ దుష్టలోకములో - పాడులోకములో మనకేది లేదు (2) యే విషయమందైన గర్వించలేము (2) - గర్వించలేము (1) జాగ్రత్తగానే నడచుకొనెదము (2)
2. కష్ట బాధలచే బ్రతుకంత నిండె - కన్నీళ్ళు నిరాశ - నిస్పృహల మయము కరుణా కటాక్ష నమ్మెదము - నమ్మెదము క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము
3. ఎంత వరకు యీ భువి యందుండెదమో - సైతానుతో సదా - పోరాటమేగా శత్రుని తంత్రాల నెరిగితిమి - నెరిగితిమి ధైర్యముతోనే కొనసాగెదము
4. గతము నంతటిని మరచిపోయెదము - గురియొద్ద కానందముతో వెళ్ళెదము మార్గాన వచ్చేటి శ్రమల నోర్చి - శ్రమల నోర్చి అర్హులమౌదము బహుమానమొంద
5. మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి - నిజ ప్రేమతోనే - జీవించెదము నిష్కళంకులమై శుద్ధులమై - శుద్ధులమై పరిపూర్ణతను చేపట్టుదము
6. జీవము గల ప్రభు రక్షించె మనల - విమోచించి నూతన జీవమొసగె కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చున్ - త్వరగా వచ్చున్ అందుచే మనము సిద్ధపడెదము
7. ఆత్మీయ నేత్రాలతో చూచెదము - ఎంత అద్భుతము సౌందర్య నగరం ప్రభువు చెంతకు వెళ్ళెదము - వెళ్ళెదము విజయోత్సవముతో ప్రవేశించెదము (2)

Back to Hebron Seeyonu Geethalu