పల్లవి:ప్రేమతో యేసు - పిలుచుచున్నాడు రమ్ము (2)రక్షణను పొంది - లక్షణముగా వెళ్ళుదము (2)
1. పాపమెరుగని ప్రభు నీ కొరకు - పాపముగను చేయబడెను (2) శాపగ్రహియాయె సిలువలో (2) పరుగిడి రమ్ము (1) శాపగ్రహియాయె సిలువలో (2) పరుగిడి రమ్ము (1)
2. ముండ్ల కిరీటమును ధరించి - ముఖముపై నుమ్మి వేయబడె ప్రాణమిడె నేసు సిలువలో - పరుగిడి రమ్ము ప్రాణమిడె నేసు సిలువలో - పరుగిడి రమ్ము
3. సిలువలో నీకై దప్పిగొని - కలుష నీ క్షమకై ప్రార్థించి సహించి ప్రాణమిడె నీ కొరకు - పరుగిడి రమ్ము సహించి ప్రాణమిడె నీ కొరకు - పరుగిడి రమ్ము
4. తప్పిన గొర్రెను రక్షంప - తనదు రక్తమును చిందించె కాపరి స్వరము ధ్వనించె - పరుగిడి రమ్ము కాపరి స్వరము ధ్వనించె - పరుగిడి రమ్ము
5. తామసించ తగదిక ప్రియుడా - త్వరపడుము నీ రక్షణ కొరకు నేడే నీ రక్షణ దినము - పరుగిడి రమ్ము నేడే నీ రక్షణ దినము - పరుగిడి రమ్ము
6. తానే కడుగును తన రక్తముతో - తండ్రివలె నీ పాపమునంత తనయుడవై పోదు విపుడే - పరుగిడి రమ్ము తనయుడవై పోదు విపుడే - పరుగిడి రమ్ము
7. ప్రేమవార్త ప్రకటింపబడె - ప్రియుడు యేసుని యొద్దకు రమ్ము కృపాకాలమిదే జాగేల - పరుగిడి రమ్ము కృపాకాలమిదే జాగేల - పరుగిడి రమ్ము