పల్లవి:ప్రభు యేసు పిలుపును ఓ ప్రియుడా - పెడచెవిని పెట్టెదవా (1)తీర్మానము చేయకనే వెళ్ళెదవా - ప్రభుసన్నిధిలో నుండి (2)
1. లేత వయస్సు నడిప్రాయమును - గతించి పోవునవి (2) మన్నయినది వెనుకటివలెనే - మరల భూమికి చేరున్ (2) ఆత్మదాని దయచేసిన - దేవుని యొద్దకు పోవున్ (2) ఆ లోకములో నీ ముందుగతి ఏమౌనో ఎరిగితివా (2)
2. ఏపాటిది నీ జీవితమంత - ఏపాటిది నీ తనువు గడ్డిపువ్వుతో సమమిదియేరా - అదియే నీ జీవితము అంతలోన మాయము అగు - వింత బుడగయే కాదా అంతలోన అంతర్థానంబగు ఆవిరియేకాదా
3. వ్యర్థము వ్యర్థము సర్వము యిలలో - ఇదియే యేసుని మాట నిలువని నీడ యీ లోకమురా - కలుషాత్మ కనుగొనరా లోకమంత సంపాదించి - లోభీ నీ ప్రాణమును నష్టపరచుకొనిన నీకు నరుడా లాభముకలదా
4. తామసించ తగదిక నీకు - తక్షణమే తిరుగుమురా విరిగి నలిగి హృదయము కరిగి - వినయముతో ప్రభు జేరి యేసు ప్రభుని సిలువచెంత - యేసుని రక్తముకోరి ప్రలాపించి నీదు సకల పాపము నొప్పుకొనుమా
5. నీ రక్షణకై నిలిచెను యేసు - తన రక్తధారలతో కడుగును నిన్ను క్షమించును - వడిగా యీ క్షణమందే నీ నామమును పరలోకములో - నేడే వ్రాసి యుంచున్ రక్షణానందముతో నిప్పుడే రంజిల్లెదవు ప్రియుడా