పల్లవి:కాలవిలువ నీకు తెలియకపోయిన - కన్నీరు కార్చెదవు (2)
అను పల్లవి:భువిలో యేసు నిన్నుంచిన యుద్దేశము (2)భావమందు తలచి యేసుచే జీవించుము (2)
1. ఇష్టప్రకారము మనసు వీడి నడచి - కోప పాత్రుడ వగుదువె (2) రక్షణ్య జీవితమొంది సంతోషించ (2) ననుగ్రహ కాలమిదే యని తెలిసి (2)
2. ఇహమందు సేవకు యేసు నిన్ను పిల్చె - నని తెలిసికొనుము ఘనమైన పనిని మరచి నిద్రించిన పగలు గతించక నిక నేమి చేతువు
3. నోవహుకాలమున నూట ఇరువది - యేండ్లు చూచి లోకమును నశింప జేసెను కృపతో నీ కిడిన ఆయుస్సు ఈ ఏటితోనే ముగిసిన
4. ముందు యిర్మియా హనన్యాకు తెలిపిన - ఏటనే మృతిపొందెను ఏ సమయము నీకు సొంత మనకుము ఈ ఏటనే నీవు మరణించవచ్చును