CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 356

మానవ రూపమును ధరించి

maanava roopamunu dharinchi

John 4:42

More
Reference recording on YouTube ↗
పల్లవి:మానవ రూపమును ధరించి - అరుదెంచె యేసు ఇహమునకు (1)ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే (2)
1. కౄర సిల్వనెక్కి తానే యోర్చె దుఃఖబాధలన్ (2) శరీరమంతటినుండి కార్చెనమూల్య రక్తమున్ (2) వేరే దిక్కిక లేదుగా ప్రియులారా చూడండి సిల్వన్ (1) ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే (2)
2. చేసెను వెల్లడి పరమ తండ్రి గొప్ప ప్రేమన్ మనకై - యేసు ప్రాణమిచ్చెను నీచులైన పాపులకైయేసును స్వీకరించుము నీ - స్వంత రక్షకునిగా ఈ పాపలోకమునకు రక్షకుండు ఆయనే
3. సణుగుచును శాంతిలేక పాపభారము క్రిందను - కన్నీటిని విడచుచును దూరముగా నీవుందువా? నిన్ను యేసు నేడే పిలిచెన్ ఆయన యొద్దకురా ఈ పాప లోకమునకు రక్షకుండు ఆయనే

Back to Hebron Seeyonu Geethalu