పల్లవి:సాటి లేనిది యేసుని రక్తము - పాపమును కడుగును -ప్రియుడా పాపమును కడుగును .. ఆ ..ఆ .. (2)
1. చూడుము సోదరా దేవుడు ఎంతో - ప్రేమించె యీ జగతిన్ - ప్రియుడా ప్రేమించె యీ జగతిన్ (2) సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు (2) యేసుని పంపెను - ప్రియుడా యేసుని పంపెను (1)
2. లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు - ప్రాణము బలిగా నిచ్చె - ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చె లోకపాపమెల్ల సిలువలో మోసి తొలగించె శాపమున్ - ప్రియుడా తొలగించె శాపమున్
3. విముము సోదరా ప్రభుయేసు క్రీస్తుని - పరలోక వార్తను - ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించు చుంటిమి - ప్రియుడా చాటించు చుంటిమి
4. యేసుని నీవు క్షమించుమని వేడు - విరిగిన హృదయముతో - ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారలే కడుగును పాపమెల్ల - ప్రియుడా కడుగును పాపమెల్ల
5. పాప భారమును మోసికొని నీవు ప్రయాస మొందెదవా? -ప్రియుడా ప్రయాస మొందెదవా? పాపమొప్పుకొని యేసు పాదముల చెంతకు జేరుము - ప్రియుడా చెంతకు జేరుము
6. గతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము - ప్రియుడా శీఘ్రముగా రమ్ము కర్త యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము - ప్రియుడా రక్షణ పొందుము
7. కృపయనందము పవిత్ర ప్రేమలో భాగము పొందుము - ప్రియుడా భాగము పొందుము పాప సాగరమును దాటించ గలడు యేసు రక్షకుడే - ప్రియుడా యేసు రక్షకుడే