పల్లవి:రారండి యేసు పాదముల చేర - పాప విముక్తి పొంద (2)
అను పల్లవి:వచ్చువారల త్రోయనని - నెచ్చెలు డేసు వాక్కు నిచ్చెను (2) రారండి (1)
1. జాగేల పాపి నీవింకను చావునకు తప్పెదవా? (2) సద్గురు చరణము వెదకిన - సద్గుణముగ నిను మార్చును (2)
2. ఆశతో యేసు నిలిచియున్నాడు -పాపీ - నిన్ను రక్షింపను జీవితము మోసమగుచున్నది - పాపీ - యేసుని రక్షణ వెదుక
3. నేడే నే మరణించిన నెచట చేరుదునని తలచి యేసుని చెంత రమ్ము తరుణము - దొరుకదు గుణపడుము వేగమే
4. ఈ ప్రేమ ఉత్కృష్టమని యెంచి వెంటనే రారమ్ము నీదు పాపముల క్షమింపను - నాథు డేసుడు సిల్వ నెక్కెను
5. పాపము శాపము తోడను వచ్చెదనని చెప్పుము జీవ దేవాది దేవుడు నీకై - చేయునదెల్ల పరికింపను
6. మాయవేషముల ధరియించి కాలము వ్యర్థపరచి తప్పుడు బోధ చేయువారల - వీడి పరమున జేరనిచటకు
7. కడపటి కాలమిదే యగును ఇల మోసపోకుడి మిత్రుడేసుడు మీకు ఇచ్చిన - దాని పొందుచు పాడు డల్లెలూయా