పల్లవి:రండి రండి యేసుని యొద్దకు - రమ్మనుచున్నాడు (2)
అను పల్లవి:ప్రయాసపడి భారము మోయువారలు (2)ప్రభునిచెంతకు పరుగిడి వేగమె (2) || రండి ||
1. యేసుని పిలుపు వినియు నింక యోచింపరేల (2) అవనిలో అగచాట్ల పాలైన (2) అబ్బదు శాంతి ఆత్మకు నిలలో (2)
2. కరువు రణము మరణము చూచి - కలుగదు మారుమనస్సు ప్రవచనములు సంపూర్ణము లాయెను యూదులు తిరిగి వచ్చుచున్నారు
3. ప్రభు యేసు నీ కొరకై తనదు - ప్రాణము నిచ్చెగదా సిలువను రక్తము చిందించియును బలియాయెను ఆ ఘనుడు మనకై
4. యేసుని నామమునందే పరమ - నివాసము దొరుకును ముక్తిని పాప విమోచనమును - శక్తిమంతుడు యేసే యిచ్చును
5. నేనే మార్గము నేనే సత్యము - నేనే జీవమును నేనే గాకింకెవ్వరు లేరని - యెంచి చెప్పిన యేసుని యొద్దకు