CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 339

వినుడి సోదరులారా నా యేసు ప్రభు యిల కేతెంచెన్

vinudi sodarulaaraa naa yesu prabhu yila ketenchen

1 Timothy 1:15

More
Reference recording on YouTube ↗
పల్లవి:వినుడి సోదరులారా - నా యేసు ప్రభు - యిల కేతెంచెన్ (2)
1. ఇలకేతెంచెన్ - ముక్తిని దెచ్చెన్ (2) పాపుల విడిపించెన్ - విడిపించ నేసు యిలకేతెంచెన్ (2)
2. స్వర్గీయ తండ్రికి - ఏక కుమారుడు మనుష్య పుత్రుండాయెన్ - పుత్రుండుగా యిలకేతెంచెన్
3. గ్రుడ్డికి కన్నులు - మూగకి మాటలు చెవిటికి చెవుల నిచ్చెన్ - యిచ్చుటకేసు యిలకేతెంచెన్
4. కుష్ఠ రోగుల - శుద్ధులజేసెను చచ్చినవారిని లేపెన్ - లేపుటకేసు యిలకేతెంచెన్
5. పాపములో నీవు - పడియుండగా పవిత్ర ప్రేమను జూపెన్ - జూపించనేసు యిలకేతెంచెన్
6. పాపుల కొఱకై - సిలువను మోసెన్ రక్తము చిందించెన్ - చిందించ నేసు యిలకేతెంచెన్
7. యేసు నామమున - విశ్వాసముంచుము నిశ్చయముగ రక్షించున్ - రక్షించనేసు యిలకేతెంచెన్
8. మహిమ ఘనత - మాయేసు ప్రభునకే మమ్ముల తండ్రితో జేర్చెన్ - జేర్చుటకేసు యిలకేతెంచెన్

Back to Hebron Seeyonu Geethalu