పల్లవి:పరుగిడిరా సోదరుడా (1) ప్రభు సన్నిధి నీవు జేరుటకై (2) - పరుగిడరా ..
1. యుగసమాప్తికి ఆగమనమునకు - సూచన లెన్నో చూడుమురా (2) వేదన లెన్నో మీదికి వచ్చురా (2) - కలవర మొందక కని పెట్టుమురా (2)
2. ఇండ్లను గట్టుచు పెండ్లికి యిచ్చుచు - నారును నాటుచు త్రాగుచు తినుచు జగములో జనులు దిగులు లేనప్పుడు - దొంగవలె యిల దొరయై వచ్చురా
3. ఆ దినమైనను ఆ గడియైనను - పరమున దూతలు ధరణిలో మనుజులు ఎవరునుగాని ఎరుగనె ఎరుగరు - మెలకువతో యేసు పిలుపును వినుచు
4. ఆ దినముల శ్రమ అంతము కాగ - సూర్యుని చంద్రుని చీకటి కమ్ము ఆకసమందలి శక్తులు కదలును - మహిమతో యేసు యిమ్మహిదిగురా
5. ఆర్భాటముతో ఆశ్చర్యముతో - దేవుని బూరతో మనప్రభు దిగురా క్రీస్తు నందున్న మృతులగువారు - ఏకముగ ప్రభు యేసుని జేర
6. ఎటుచూచిన నీకటు కనిపించును - కొండల బండల నుండినను కొదమ సింహమై కోపాగ్నియై - ఎదురుగ వచ్చిన కదలగ లేవురా
7. ఎత్తబడుట కాయత్తమా నీవు - తరుణము యిదియే తడవు చేయకురా రక్షణలో నిరీక్షణ కలిగి - రక్షకు డేసుని రాజ్యము చేర