CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 340

రండి రండి రయమున యేసుని

randi randi rayamuna yesuni

John 3:16

More
Reference recording on YouTube ↗
పల్లవి:రండి రండి రయమున యేసుని - రక్షకునిగ నంగీకరించుడి (2)
అను పల్లవి:ప్రీతితో - ప్రభుని చేరుడి ప్రభుల ప్రభువే -రాజుల రాజువే - రాబోవు నాతడే (2)
1. ప్రయాసపడి భారము మోయువారల (2)- అతి ప్రేమతో నాహ్వానించెను (2) భారమంత పార ద్రోలును, విశ్రాంతినిచ్చును - వేగమే రారమ్ము ఈ మాట నిక్కము (2)
2. పాపపు జీతము నిత్యనరకము - ఓ పాపి నీకిక దిక్కెవరు నిత్యజీవ మియ్యవచ్చెను, నీ కొరకువచ్చెను - తన ప్రాణమిచ్చెను, నిన్నురక్షింపను
3. మాయలోకం మోసముజేసెను - మరణసమయము సమీపించెను తన్నుచేరువారి నెవ్వరిన్, తృణీకరించడు నిను త్రోసివేయడు ఈ మాట నమ్ముము
4. క్రీస్తుయేసు నిను ప్రేమించి - నీ కొరకై తానే వచ్చెన్ నీదు దోషమంతటికై, రక్తము కార్చెను - శిక్షను పొందెను, శ్రీ యేసున్ చేరుము
5. పాపులారా పరుగిడిరండి - పాపుల మిత్రుడేసుని చేరుడి శక్తితో నిన్ను రక్షించును సంతోషమిచ్చును - సందేహపడకు, సువార్తన్ నమ్ముము
6. నీదు పాపము నంతటిని - నీవు నిక్కముగ నొప్పుకొనిన ఆయనే తనరక్తముతో, కడుగు ప్రేమతో - కాపాడు నేర్పుతో, కరుణ శక్తితో

Back to Hebron Seeyonu Geethalu