పల్లవి:ప్రేమడంకా జగమున - వినబడు నాదము - నీమముగా ప్రభు సిలువచే (2)
1. మృత హృదయులకు జీవము నిడెను (2) ఆత్మల నమ్మికను రంజిల్ల జేసెను (2) జనుల యందు అద్భుతముల జేసెను - మన సిల్వ మిత్రుడు శ్రీయేసు (2)
2. సిలువ యందున శ్రీ యేసు ప్రాణమిడెన్ చెలువుగ మన శ్రమలను పార ద్రోలెన్ తన ప్రేమ పాత్రను మనకిచ్చెను - మన సిల్వ మిత్రుడు శ్రీయేసు
3. కబోధులకు కన్నుల నిచ్చెను - కాళ్ళనిచ్చెను కుంటివారలకు కొరతలేని దర్శనము మనకిచ్చెను - కొట్టబడిన మిత్రుడు శ్రీయేసు
4. ఇలను నిద్రమత్తున నుండి సోమరుని - కాలము వ్యర్థపరచెడు సుఖజీవిని పుడమిలో యేసు క్రీస్తు గరుణించెను - దొడ్డ విలువ మిత్రుడు శ్రీయేసు
5. ప్రేమతోడ నెల్లరను పిలుచునెపుడు - సోమరులను దేశదిమ్మరులను ధరణి జనులను చూచి మరలుటకు - కరుణించెను మిత్రుడు శ్రీయేసు