పల్లవి:పరలోక రాజ్యము చేరుటకు - ప్రభుయేసే మార్గంబు (2)మార్గ సత్య జీవము నేనేయని యేసే పల్కెను (2)
1. సర్వలోకుల పాప - పరిహారార్థము శ్రీ యేసు (2) పరిశుద్ధ రక్తము చిందించి - బలియాయెను శ్రీ యేసు (2)
2. పాపపరిహారార్థము - పావన రక్తము నిచ్చిన యేసుని చేర ప్రియుడా - సంశయమదియేల
3. నిను ప్రేమించి ప్రాణము - నీకై పెట్టిన యేసుని నాకు వలదంచు వెళ్ళుట - న్యాయమా ప్రియుడా
4. మరణించిన యేసు ప్రభువు - మూడవనాడు లేచెను మహిమా ప్రభావముతో యేసు - మరణము గెల్చెను
5. తక్షణమే మారు మనస్సు - నొంది యేసును నమ్మిన రక్షణ నొందెదవు - నిశ్చయముగనో - ప్రియుడా