పల్లవి:యేసు రాగానే సంఘము - మార్పు చేయబడి పైకెత్తబడును
1. మేల్కొనును క్రీస్తునందు మృతులు - కడబూర మ్రోగగనె - ఓ ప్రియులారా కడబూర మ్రోగగనె - శ్రీ యేసు రాగానే
2. కుడివైపున గొర్రెల జేర్చున్ - మేకల -నెడమ ప్రక్క జేర్చున్ - ఓ ప్రియులారా నెడమ ప్రక్క జేర్చున్ - శ్రీ యేసు తీర్పులో
3. తనవారి నత్యధికముగా ప్రేమించి - తన కేర్పరచుకొనును - ఓ ప్రియులారా తన కేర్పరచుకొనును - శ్రీయేసురాగానే
4. మేఘముపై మహిమా ప్రభావముతో - వచ్చును శ్రీయేసు - ఓ ప్రియులారా వచ్చును శ్రీ యేసు - శ్రీ యేసు దూతలతో