పల్లవి:సోదరులారా లెండి - రాకడ గుర్తులు చూడండి (1)దివిటీల నూనెతో నింపి - సిద్ధపడండి (2)
1. అర్ధరాత్రివేళలో - ప్రభురాకడ ధ్వని మ్రోగెను (2) సోమరితనము విడచి (2) నడుమున దట్టి గట్టి - ప్రభుని కెదురుచూడుము (2)
2. సర్వత్రయుద్ధాలు భూకంపములును ఘోరవ్యాధులు ఘోరముగ ప్రబలెను యేసుని రాకడ సమీపం - బాయెనో సోదరా
3. రాజ్యాలు అధికారాలన్ని - కదలిపోవుచున్నవి -కలవర మధికంబాయె కన్నులు తెరచి చూడుమా ప్రభు - వచ్చేవేళాయె
4. చెదరిన యూదులు స్వదేశానికి చేరుటే యొక సూచన క్రీస్తుయుగ మారంభము రానై యున్న వేళిదే - కనిపెట్టుము సోదరా
5. తలుపు వేయబడిన లోన - ప్రవేశించనేరవు -పశ్చాత్తాప పడుము యేసుపై నాధారపడి సంసిద్ధపడుమా