పల్లవి:రాజుల రాజుగ యేసు ప్రభుండు -రయమున రానై యున్నాడు (2)
1. రక్షణాలంకారముతో - తక్షణమే సిద్ధపడుడి (2) అక్షయుడగు నా రక్షకుని - నిరీక్షణతో వేడండి (2)
2. మన ప్రభు యేసుని రక్తము - మన పాపములను పోగొట్టి మన ప్రభురాకడ మనకెంతో - మహిమానందము కలిగించున్
3. మొదట గొఱ్ఱెపిల్ల వలె - నొదిగి వచ్చెను మన ప్రభువు కొదమసింహముగా వచ్చును - గుండెదిగులు పాపికి
4. గురుతులన్నియు జరుగుచుండ - సరిగా చూడుము విశ్వాసి త్వరపడుము నీ ప్రభుని జూడ - కరములెత్తి ప్రార్థించు
5. ఎల్లరు క్రీస్తుని రాకను - ఉల్లాసముతో కోరుచు హల్లెలూయా పాటలు పాడి - ఎల్లప్పుడు స్తుతియించెదము